Friday, April 26, 2024

రోలర్ కోస్టర్ చిత్రం పూర్తి

- Advertisement -
- Advertisement -

'Ante Sundaraniki' shoot wrapped up

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 28వ చిత్రం ‘అంటే సుందరానికీ..’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. అంటే సుందరానికీ…” అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన ‘అంటే సుందరానికీ..’ ఫస్ట్ లుక్‌లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్‌తో ఆశ్చర్యపరిచాడు. ఫస్ట్ లుక్‌తోనే ఇదొక డిఫరెంట్ మూవీ అని తెలియజేశాడు నాని. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనేది నాని పాత్ర పేరు. అంటే సుందరానికీ చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News