- Advertisement -
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్వకత్వంలో రాబోయే ‘ఖైదీ 2’ ( khaidi 2)పట్టాలెక్కడానికి ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలకు ముడి పెడుతూ ఖైదీ 2 ఉంటుందట. దీనిలో భాగంగా సినిమాలో చాలా పాత్రలు అదనంగా ఉంటాయి. అయితే ఖైదీ 2 చిత్రంలో అందమైన లేడీ భామల్ని కూడా రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా స్వీటీ అనుష్క ఈ చిత్రంలో లేడీ డాన్ (Lady Dawn) పాత్రలో కనిపించబోతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ సినిమాలో డోస్ పరిమితిని మించి ఉంటుంది. పాత్ర రగ్గడ్‌గా..రఫ్‌గా ఉంటుంది. ఆ విషయంలో లోకేష్ ఎక్కడా రాజీ పడడు. అందుకోసం అనుష్క అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. లోకేష్ డెన్‌లోకి ప్రవేశిస్తే అనుష్క కెరీర్ కూడా కొత్త టర్నింగ్ తీసుకుంటుంది.
- Advertisement -