Tuesday, May 21, 2024

ఎపిలో 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సెంటర్లకు ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎపిలో 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్ ఉంది. మంగళగిరి బూత్ నెంబర్ 197లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జరుగుతోంది. రెండు మూడు చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News