Wednesday, September 17, 2025

ఎపి ఇంటర్ ఫలితాలు విడుదల.. కృష్ణా జిల్లాకు మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం సాయంత్రం విడులయ్యాయి. ఫలితాలను మంత్రి బోత్ససత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ వృత్తివిద్య పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు 9,20,552 మంది విద్యార్థులు, వృత్తి విద్యాకోర్సుల‌కు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ తొలి ఏడాది 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత, ఇంటర్ రెండో ఏడాది 72శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం లభించగా.. విజయనగరం జిల్లాకు చివరి స్థానం లభించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ పరీక్షలు నిర్వ‌హించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News