Monday, September 1, 2025

ఉపరాష్ట్రపతి రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించింది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు వాళ్లందరూ సుదరర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నీలం సంజీవ రెడ్డి, పివి నరసింహరావు, ఎన్టిఆర్, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపిలు, హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ల అస్తిత్వం కనుమరుగవుతోందని, సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలోకి రావడంతో.. ఎన్డియే కూటమికి బలమైన ఛాలెంజ్ విసిరినట్టు అయిందని తెలియజేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించిందని, ఉపరాష్ట్రపతి రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయో గమనించామని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్లకి.. రాజ్యాంగాన్ని కాపాడాలనే వారికి మధ్య జరుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ అని కొందరు అంటున్నారని, నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అని రేవంత్ కొనియాడారు. తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలని ఎపి సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మాజీ సిఎం కెసిఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆత్మప్రభోదానుసారంగా ఓటేయ్యాలని తెలుగు ఎంపిలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటును కాపాడాలంటే దాన్ని కాపాడే వ్యక్తి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News