Monday, March 27, 2023

నాందేడ్‌లో సిఎం కెసిఆర్ సభకు భారీ ఏర్పాట్లు

- Advertisement -

నిర్మల్ : ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో సిఎం కెసిఆర్ పాల్గొనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి , టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. సభ స్థలానికి చేరుకొని నిర్వహకులతో మాట్లాడారు.

సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుండి పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరు కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News