Tuesday, October 15, 2024

21 మంది బాలలపై అత్యాచారాలు..వార్డెన్‌కు మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌కు అక్కడి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అందులోనూ బాలలపై నేరాభియోగాల కేసులు పోక్సో చట్టం పరిధిలో ఓ వ్యక్తికి తీవ్రస్థాయి మరణశిక్ష పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అయింది. బాల బాలికలను తండ్రిగా సంరక్షకుడిగా చూసుకోవల్సిన వార్డెన్ యంకెన్ బగ్రా ఆటవికంగా మారి 21 మంది చిన్నారులపై లైంగిక అత్యాచారాలకు దిగినట్లు వెల్లడైంది. 2020లో ఓ తండ్రి తన కవల కూతుళ్లుపై వార్డెన్ అత్యాచారం జరిపినట్లు , తరువాత కూడా వేధింపులకు దిగుతున్నట్లు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చీకటి పాపాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక న్యాయమూర్తి జావెప్లు ఛాయ్ ఈ కీలక తీర్పు వెలువరించారు. వార్డెన్‌కు మరణశిక్షతో పాటు మాజీ హెడ్ మాస్టర్ సింగ్టుంగ్ మోర్పెన్ , హిందీ లేడీ టీచర్ మార్బమ్ గామ్దిర్‌లకు 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించారు.

పోస్కో చట్టం పరిధిలో ఈ వార్డెన్ అఘాయిత్యాలను నివేదించకపోవడం, పైగా మరిన్ని ఘటనలకు దారితీసేలా వ్యవహరించినందుకు ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. వార్డెన్ తమపై లైంగిక దారుణాలకు పాల్పడుతున్నట్లు పిల్లలు కొందరు ప్రధానోపాధ్యాయుడికి తెలిపినా, పట్టించుకోలేదని, ఈ విషయం వెలుగులోకి వస్తే వారి బతుకులు బజారున పడుతాయని, స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని బెదిరించినట్లు వెల్లడైంది. బాలలు రేప్‌నకు గురయ్యారు. ఇటువంటి చేష్టలలో ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ఘటనల్లో బాధితులు జీవచ్ఛవాలుగా బతికే ఉన్నపుడు ఈ నేరస్తునికి ఈ విధంగా చట్టబద్ధంగా ఉరిశిక్ష పడటం కీలక పరిణామం అని, పోక్సో కేసుగా దీనిని కోర్టుకు తీసుకువెళ్లిన లాయరు ఒయామ్ బింగెప్ తెలిపారు. బాధిత 21 మంది బాలబాలికల తరఫున ఆయన వాదించారు. 2014 నుంచి 2022 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో వార్డెన్ ఈ దారుణాలకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగిన తరువాత నిర్థారణ అయింది.

21 మంది మైనర్లపై వార్డెన్ లైంగిక దాడులకు దిగినట్లు, బాధితుల్లో 6 నుంచి 14 ఏండ్ల లోపు బాలలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. గత ఏడాది జులైలో ఛార్జిషీట్ దాఖలు అయింది. పిల్లలకు డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు వార్డెన్‌పై అభియోగాలు రాగా అవి నిజమేనని నిర్థారణ అయింది. బాధితుల్లో ఆరుగురు ఆత్మాహత్యా యత్నానికి పాల్పడినట్లు కూడా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News