Monday, July 21, 2025

ఓటమి బిపితోనే సోదాలు అరెస్టులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికలలో ఓటమి భయం పట్టుకున్న బిజెపి ఇప్పుడు దిక్కుమాలిన పనులకు దిగుతోందని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ నేత సంజయ్ సింగ్ నివాసంపై దాడులు, ఆయన అరెస్టుతో బిజెపి పెద్దల నిరాశ నిస్పృహల తంతు ఎంతకు దిగజారిదనేది వెల్లడయిందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఓటమి తొంగిచూస్తూ ఉండటంతోనే పెద్ద వ్యక్తి ఈ చేష్టలకు పురికొల్పాడని కేజ్రీవాలల్ పరోక్షంగా మోడీపై మండిపడ్డారు.

తమపై ఇటువంటి దాడులు మరింతగా జరుగుతాయని, అయితే తాము బెదిరింపులకు భయపడేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇటువంటి దాడులు మరింతగా జరుగుతాయని, ఇడి, సిబిఐ, ఐటి, పోలీసు ఈ విధంగా పలు బృందాలు కదలివస్తాయని , ఒక్కరోజు క్రితం దేశంలోని జర్నలిజంపై దాడి జరిగింది. ఇప్పుడు సంజయ్‌ను అరెస్టు చేశారని, ఇటువంటి అరాచకాలకు భయపడేది లేదన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News