Friday, April 26, 2024

పెండింగ్ ఆసరా పింఛన్ల పంపణీకి ప్రక్రియ వేగం

- Advertisement -
- Advertisement -

ఐదారు రోజుల్లో అందజేస్తామంటున్న అధికారులు
అర్హుల జాబితాపై పిర్యాదులు రావడంతో మరోసారి పరిశీలన
పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న అధికారులు

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పెండింగ్ ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు వేగం చేశారు. వయస్సు కుదింపు చేసిన తరువాత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు వడపోత చేపట్టి అర్హులను గుర్తించి గత రెండు నెల నుంచి ఆసరా కార్డులు స్దానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు పంపిణీ చేశారు. జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వారు ఇప్పటివరకు 1.98 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి నెలకు వృద్దులు, వితంతువులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 చొప్పన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం కొత్తగా 80,824 మంది గుర్తించి దశలవారీగా కార్డుల పంపిణీ ప్రకియ చేస్తుంది. అందులో 58,300 మంది వృద్దులు, 22,524 వితంతు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికుల, బోధకాలు వ్యాధ్రిగస్తులకు మంజూరు చేశారు. వారిలో ఇప్పటివరకు 74,231 మందికి కార్డులు అందజేశారు. 5933 మంది కార్డులు పెండింగ్‌లో పెట్టారు.వాటిపై స్దానిక ప్రజాప్రతినిధులకు నిరసన పెరగడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడంతో ఐదారు రోజుల్లో వాటిని అందజేసేందుకు అధికారులు చర్యలు వేగం పెంచారు. ఈకార్డుల విషయంలో స్దానికంగా ఫిర్యాదులు రావడంతో వారి ఆస్తుల వివరాలు పరిశీలన చేసేందుకు సమయం పడటంతో మంజూరుకు అధికారులు నుంచి అనుమతి తీసుకోవడంతో కొంత ఆలస్యమైందని జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇంకా కొంతమంది వృద్దులైన పుట్టిన తేదీ వివరాలు సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తులు పక్కకు పెట్టినట్లు వాటిపై మరోసారి పరిశీలన చేసి అర్హులకు ఇస్తామంటున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో కూడా 20 శాతం వరకు అర్హతలేని వారు పొందుతున్నట్లు, ప్రభుత్వం నుంచి అనర్హుల ఏరివేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటిని తొలగిస్తామని పేర్కొంటున్నారు. పింఛన్ కోసం ఎదురుచూసే పేద, మధ్యతరగతి స్దానికంగా ఉండే రాజకీయ దళారులను ఆశ్రయించవద్దని,వారి వద్దకు వెళ్లితే వేలకు వేలు లంచాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని పట్ల అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News