Thursday, September 19, 2024

తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనున్న అస్నా తుఫాను

- Advertisement -
- Advertisement -

తెలంగాణ, కర్నాటక, గుజరాత్ కు భారీ వర్ష సూచన: ఐఎండి

‘అస్నా’ తుఫాను ఆదివారం వాయవ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైంది.  ఇది మరింత ముందుకు కదిలి సాయంత్రానికల్లా తీవ్ర అల్పపీడనంగా, సోమవారం ఉదయం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇదిలావుండగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా పయనించి 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది.

కోస్తా కర్నాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, కేరళ, మహే, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి లో ఈ వారం ఓ మోస్తరు వానలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం మాత్రం తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో మాత్రం భారీ వానలు పడతాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 15 నాటికి తిరోగమిస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

గుజరాత్ లో వరదలకు ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్లు సమాచారం. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో దాదాపు 27 మంది హఠాత్తు వరదలకు చనిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News