Sunday, April 28, 2024

ఎన్టీఆర్ మౌనంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన కొద్దిరోజులుగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే తెలుగురాష్టాల్లో నిరసనలు జోరందుకున్నాయి. శుక్రవారం మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా తనపై కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వైపు ఫోకస్ చేయాలని సూచించారు. జూ.ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో అతడినే అడగాలని విలేకరులకు సూచించారు. ఎవరినీ స్సందించాలని తాము అడగమన్నారు.

జనసేనతో పొత్తు విషయమై అచ్చెన్నాయుడు రానున్న రోజుల్లో ఆ పార్టీతో సన్నిహితంగా మెలగాలని యోచిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తల మద్దతును ఆయన హైలైట్ చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య సంఘీభావం తెలుపుతూ జనసేన సభ్యులు టిడిపి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా చేరారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News