Saturday, October 12, 2024

21న ఢిల్లీ కొత్త సిఎం ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఒక వర్తమానంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారానికి తేదీని ఈ నెల 21గా ప్రతిపాదించారు. అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మంగళవారం రాజీనామా చేయగా, ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా ఆతిశీ కోరిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ ఢిల్లీ సిఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా లేఖ ప్రతులను, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆతిశీ అవకాశం కోరుతున్న లేఖ ప్రతులను ‘ఇండియా టుడే’ ప్రత్యేకంగా సంపాదించింది. కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాకుండా రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి రాశారు. అయితే, కేజ్రీవాల్ తన రాజీనామా సమర్పణకు ఎల్‌జి వికె సక్సేనాను స్వయంగా కలవడం గమనార్హం. పదవికి కేజ్రీవాల్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు లెఫ్టినెంట్ గవర్నర్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News