Friday, September 20, 2024

ప్రియురాలు, ప్రియుడిపై దాడి… అర్థనగ్నంగా ఊరేగించారు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ప్రియుడితో ప్రేమ వ్యవహారం నడిపిన ప్రియురాలని గ్రామస్థులు చితకబాది అనంతరం ఆమెను అతడితో కలిసి అర్థ నగ్నంగా ఊరేగించిన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కర్జియన్ ప్రాంతంలో ప్రియుడితో కలిసి తిరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు ప్రియురాలిని కొందరు పట్టుకున్నారు. ప్రేమ జంటపై దాడి చేసి అనంతరం ఇద్దరిని అర్థనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. జంటపై దాడి చేసిన వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News