- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో వైసిపి ఎంపిపి పురుషోత్తంరెడ్డిపై దాడి జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా పురుషోత్తంరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. టిడిపి నేతలే తనపై దాడి చేశారని పురుషోత్తంరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దాడికి నిరసనగా హిందూపురంలో వైసిపి నేతలు ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపణలు చేశారు.
- Advertisement -