Wednesday, October 9, 2024

ఆర్మీ ప్రత్యేక రైలు పేల్చివేతకు కుట్ర

- Advertisement -
- Advertisement -

దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్నట్లు అనుమానాలు కలిగించేతా వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలుగజేసే మరొక పన్నాగం బహిర్గతమైంది. ఆర్మీ సిబ్బందితో వెళుతున్న ప్రత్యేక రైలును పేల్చివేసే కుట్ర రైలు పట్టాలపై ఏకంగా పది డిటోనేటర్లను దుండగులు అమర్చారు. అయితే. అదృష్టవశాత్తు ఎటువంటి నష్టమూ జరగకుండానే కుట్ర భగ్నమైంది. మధ్య ప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైన్యానికి చెందిన ప్రత్యేక రైలు జమ్మూ కాశ్మీర్ నుంచి కర్నాటకకు వెళుతున్న సమయంలో సగ్‌ఫటా రైల్వే స్టేషన్ సమీపంలో డిటోనేటర్లను గుర్తించారు. ఒక డిటోనేటర్ పేలడంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును ఆపాడు. దీనితో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందజేశాడు. ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ). రైల్వే, స్థానిక పోలీస్ సీనియర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనపై వారు దర్యాప్తు మొదలు పెట్టారు.

రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్
ఉత్తర ప్రదేశ్‌లో ఒక చోట రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను రైల్వే భద్రత సిబ్బంది గుర్తించారు. ఆదివారం తెల్లవారు జామున కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై ఆ సిలిండర్‌ను గుర్తించారు. అది ఖాళీ సిలిండర్ అని నిర్ధారించారు. ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును ఆపాడు. ఉదయం 8.10 గంటల సమయంలో రైలు కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు వెళుతున్న సమయంలో ఆ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 5 కిలోల గ్యాస్ సిలిండర్‌ను ట్రాక్‌పై ఉంచారని, ఆ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసుల చెప్పారు. కాగా, ఉత్తర ప్రదేశ్‌లో ఈ తరహా ఘటనన జరగడం ఈ నెలలో రెండవ సారి కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News