Sunday, December 15, 2024

హెడ్ అర్ధశతకం..ఆసీస్ 136/5

- Advertisement -
- Advertisement -

పెర్త్‌ టెస్టులో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆసీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేస్తున్నారు. దీంతో పరుగులు చేసేందుకు ఆసీసీ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే, ట్రావిస్ హెడ్ మాత్రం టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈక్రమంలో హెడ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో మార్ష్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఇద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 37 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(84), మార్ష్(37)లు ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 388 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు 5 వికెట్లు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News