Tuesday, October 15, 2024

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బీటెక్ విద్యార్థులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వ్యసనాలకు బానిసై విద్యార్ధులు ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన సొమవారం కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం నెల్లూరుకు చెందిన చంద్రబాబు,అప్రోజ్,అజిబ్‌లు బీటెక్ చదువూతున్నారు. భద్రాచలం నుండి ఖమ్మం వెళ్తున్న ఆర్‌టిసి బస్సులో 8.5 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. ఇదే సమయంలో పల్లిపాడు సమీపంలో పొలీసులు తనిఖీలు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న

ఈ ముగ్గురు యువకులు పల్లిపాడు సమీపంలో బస్సు దిగి రోడ్డుపై అనుమానాస్పదంగా ఎక్సైజ్ పోలీసులకు కనిపించారు.వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా రూ.2 లక్షల విలువచేసే 8.5 కేజీల గంజాయి ఉంది. వెంటనే సీఐ మమత,ఎస్‌ఐ సాయిరాం గంజాయి తరలిస్తున్న యువకులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురిని వైరా ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ దాడుల్లో వైరా ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News