Wednesday, April 24, 2024

మోడీకో హఠావో….దేశ్‌కో బచావో

- Advertisement -
- Advertisement -

Balka Suman Fires on PM Modi

మోడీకో హఠావో….దేశ్‌కో బచావో
ప్రస్తుతం ఇదే దేశ ప్రజల నినాదంగా మారింది
ఆయన పాలనలో దేశం పూర్తిగా అధోగతి పాలైంది
బిజెపియేతర ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలకు మోడీ యత్నించడం సిగ్గుచేటు
కాషాయ పార్టీకీ కౌంట్‌డౌన్ మొదలైంది
త్వరలోనే ఆ పార్టీ మళ్లీ రెండు సీట్లకే పరిమితం కానుంది
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం విప్ బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ హయంలో దేశ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిందని మండిపడ్డారు. దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలిపెట్టి ఆదానీ సేవలో తరలిస్తున్న మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని విమర్శించారు. బిజెపి ఎన్ని స్థానాల నుంచి ప్రారంభమైందో… మళ్లీ అంతే సంఖ్య (రెండు ఎంపి స్థానాలు)కు పరిమితం కానుందన్నారు. మోడీ పాలనపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయన్నారు. ముఖ్యంగా దేశ యువత మోడీకో హఠావో.. దేశ్‌కో బచావో అనే నినాదాన్ని అందుకున్నారన్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు క్రమంగా పాకుతోందన్నారు.
ఆదివారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శాససనభ్యులు కె. పి. వివేకానంద, ముఠా గోపాల్, డాక్టర్ మెతుకు ఆనంద్, నోముల భగత్, ఎంఎల్‌సి దండే విఠల్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పైన బిజెపి నేతలు మాట్లాడిన తీరు దుర్మార్గమన్నారు. నిసిగ్గుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సొంత రాష్ట్రం పంజాబ్ లో ఏమీ చేయలేక ఇక్కడ ఏదోదే చేస్తామని ఢాంబీకాలు పలుకుతున్నారని విమర్శించారు. తరుణ్ చుగ్ గురించి ఢిల్లీలో ఎవరిని అడిగినా… ఆయన వ్యక్తిత్వం గురించి అందరు చాలా బాగా చెబుతారని వ్యంగ్యస్త్రాలను సంధించారు. నాంపల్లిలోని బిజెపి ఆఫిస్ దగ్గర సాలు దొర..సెలవు దొర అనే డిజిటల్ బోర్డు తీయాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. లేనిపక్షంలో తీవ్ర పరిమాణాలను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. బిజెపి నేతలకు టిఆర్‌ఎస్ లాంటి పార్టీ ఎక్కడా దొరకలేదని.. తమను అనవసరంగా గెలికితే తరిమి తరిమి కొడతామని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ హెచ్చరించారు.

బిజెపియేతర ప్రభుత్వాలు ఉండకూడదా?
దేశంలో బిజెపియేతర ప్రభుత్వాల మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా మోడీ ప్రభుత్వం యత్నిస్తుండడం సిగ్గుచేటని బాల్కసుమన్ విమమర్శించారు. ఒక ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ…. దేశానికి మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టుకుండా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తుండడం శోచనీయమన్నారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను బిజెపి కూల గొట్టిందని… ఇప్పుడు మహారాష్ట్ర లో అదే పని చేస్తోందని మండిపడ్డారు. దీంతో దేశంలో ఎప్పుడు లేని విధంగా పరిస్థితులు అధ్వానంగా మారాయన్నారు.
బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మోడీ చేస్తున్న విదేశి పర్యటనలు ఆదాని లబ్ధికోసమేనని అన్నారు. ఇది చాలా సందర్భాల్లో రుజువైందన్నారు. అందుకే ఆదానీ ఆస్తులు గుట్టులు పెరిగినట్లుగా పెరుగుతున్నాయన్నారు. బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే ఆయనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడుగానీ ఆదానీకి 2014లో ఉన్న ఆస్తి ఎంత? ఇప్పుడు ఎప్పుడు ఎంత? అన్ని బయడపడతాయన్నారు. అమెరికా ఎన్నికలకు మోడీకి ఏమి సంబంధమని ప్రశ్నించారు. అక్కడ ఒక పార్టీకి మద్దతు ఇచ్చి దేశాన్ని అప్రతిష్ట పాలు చేశారని మండిపడ్డారు. గతంలో ఏ ప్రధాన మంత్రులు చేయని విధంగా మోడీ అత్యధికంగా అప్పులు చేసి….దేశాన్ని సర్వనాశనం చేశారనేనారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోని విధంగా దెబ్బతిందన్నారు. దీనిని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై
ఇడి, ఐటి దాడులు చేయిస్తున్నారన్నారు.

దేశానికీ బిజెపి ఏం చేసిందో చెప్పాలి
రాష్ట్రంలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలోనైనా దేశానికి మోడీ ప్రభుత్వం చేసిందో ఏమిటో ప్రజలకు చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు చేసిన మేలు కూడా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు అయినా జాతీయ హోదా ఇచ్చారా? అని ఆయన మరోసారి నిలదీశారు. మిగిలిన రాష్ట్రాలను అన్నీ ఇస్తున్న మోడీ… తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

Balka Suman Fires on PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News