Monday, September 15, 2025

అర్థం కానిది

- Advertisement -
- Advertisement -

వలసలు అనివార్యమైన ప్రతిసారీ ఇదే ప్రశ్న ‘ఎందుకిది?’ అని
బతకడం కోసమా, సుఖాన్వేషణల కోసమా, అందరినీ చించుకునే ‘స్కిప్’ కోసమా ప్చ్.. తెలియదు
వెళ్ళిపోవాలె.. తెంచుకుని, కోసేసుకుని, కత్తిరించుకుని వెళ్ళిపోవాలె
కానీ.. ఎక్కడికి?.. తెలియదు.. కానీ వెళ్ళిపోవాలె
యూనివర్సిటీలు.. సర్టిఫికెట్లు
పాస్‌పోర్టులు.. వీసాలు.. ‘పోర్ట్‌ఔట్’లు
వీటిని విడిచిపెడ్తున్నావూ అంటే..
వాడికి చేరువవుతున్నావూ అని అర్థం
‘గివ్‌అండ్టేక్పాలసీ’ ఒకటి, ‘యూస్‌అండ్త్రో’ మరొకటి
‘యూస్‌అండ్ప్రిజర్వ్’ రహస్యం తెలుసుకోవాలె
మెడలో ‘సోల్’ ట్యాగ్ గురించీ, జేబులో ఐఐటి గోల్డ్ మెడల్ కాసుబిళ్ళ
గురించీ స్పృహించాలె.. అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.. భరించాలె
బనారస్ సింధూ యూనివర్సిటీ
పురాతన భవనాల్లో ముక్కవాసన కొట్టే
జ్ఞాన పరిమళం.. ప్రజ్వలిస్తుంది
ఏదో లోపలి నుండి నిష్క్రమిస్తుండగా,
మరేదో ఆత్మలోకి ప్రవేశిస్తుంటుంది
పరుగెత్తీ, పరుగెత్తీ వారణాసి మణికర్ణిక
ఘాట్‌లో సగం కాలిన చితిలో నుండి
ఇంకా కాలవలసిన సగం ‘చేయి’
కమురు వాసన
చదువు కోసం.. ఉద్యోగం కోసం..
జ్ఞాన దాహార్తి కోసం
ఇంకా దేనికోసమో తెలియని దానికోసం
ఎక్కడి బనారస్బిహెచ్యు
ఎక్కడి రష్యా ప్రెసెడెంట్పుతిన్కోరికపై
షెవ్మాష్కం పనీ మానవ రహిత
సముద్ర జలాంతర్గామి ‘బెల్గొరోడ్కె-329’
మోడల్-ఖండాంతరంగా వేల కిలోమీటర్లనులక్ష్యించ గల అణుక్షిపణుల వాహక నౌకలో
అంపాసిటీ అండ్డి- కార్బనైజ్డ్ ఎలక్ట్రిఫికేషన్కోసం తనొక్కడికే పిలుపు
శాస్త్రవేత్తలు, మేధావులు ఖండాంతర
స్థాయిలో అమ్మబడ్తారు, కొనబడ్తారు
పే, యూజ్ అండ్కిల్.. ఒక అనిర్ధారిత సిద్ధాంతం
దేశ ప్రేమలు జెండాలు, జెండాలుగా
రెపరెపలాడ్తున్న పిచ్చి ఉన్మాదంలో
సైనికులందరూ సోల్డవుట్ బానిసలే…
బాండెడ్లేబర్.

ఒక పిచ్చి ట్రంప్ అరచి కరిస్తే
ఇరాన్‌లో B-2 స్పిరిట్ బంకర్
బాంబులు ప్రేలాలె
ఒక ఉత్తర కొరియా కిమ్ కరిచి అరిస్తే
లక్షల తలలు వంచి ‘జీహుజూర్’ అని
తలలను కోసి బంగరు పళ్ళెంలో పెట్టివ్వాలి-
ప్రపంచం బహు ధృవ కేంద్రాలుగా
పోలరైజ్ ఔతున్న వేళ
ఎవరు ఎవరైనా
ఎవరో ఒకరికి బానికకొక, బానిసకొక
బానిసకొక బానిస
బానిసల ప్రపంచానికి జిందాబాద్

రామా చంద్రమౌళి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News