Sunday, April 28, 2024

జాతీయ స్థాయిలో మెరిసిన సిద్దిపేట విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్‌గా మారిన సిద్దిపేట నియోజక వర్గం కీర్తి మరోసారి జాతీయ స్థాయిలో మారుమోగింది. సిద్దిపేట అర్బన్ మండలం బక్రి చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల వెన్నెలకు అడవులపై పరిశోదన చేసే అరుదైన అవకాశం దక్కింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో గల ఇందిరా గాంధి కృషి విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విధ్యనభ్యసించడానికి గత మే నెల 28 న అర్హత పరీక్షలు నిర్వహించారు. ఇందులో పీహెచ్‌డీ సీటు దక్కించుకోవడానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోటి పడ్డారు.

కానీ జాతీయ స్థాయిలో వెన్నెలకు మొదటి స్థానం దక్కింది. వెన్నెల జిల్లా వెటర్నరి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పురుమాండ్ల కొండల్ రెడ్డి రేవతిల తొలి సంతానం. మిగతా ఇద్దరు అమ్మాయిలను చదువులో ప్రోత్సహిస్తున్నారు. కాగా పదో తరగతి వరకు సిద్దిపేటలోని తులిప్ స్కూల్‌లో చదివిన వెన్నెల హైదరాబాద్‌లో ఇంటర్ చదివింది. ములుగులోని ఫారెస్టు కళాశాలలో బీఎస్సీ ఫారెస్టు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గల బెనారస్ హిందు యూనివర్సిటీలో ఆగ్రో ఫారెస్టు పీజీ విద్యనభ్యసించింది. పీజీ అర్హత పరీక్షలోను జాతీయ స్థ్ధాయిలో 9వ ర్యాంక్ సాధించింది. తాజాగా పీహెచ్‌డీ మొదటి ర్యాంకుతో మూడేళ్లు రాయపూర్‌లో ఆడవులపై పరిశోదన నిర్వహించడానికి సిద్దమైంది.
సిద్దిపేట గర్వపడేలా మొదటి ర్యాంకు
విద్యార్థిని అభినందించిన మంత్రి హరీశ్‌రావు
మన సిద్దిపేట ప్రాంతం గర్వపడేలా పురుమాండ్ల వెన్నెల జాతీయ స్ధాయిలో మొదటి ర్యాంకు పొందడం నిజంగా చాలా సంతోషమైన విషయమన్నారు. ఎంతో మంది విద్యార్థులకు వెన్నెల స్ఫూర్తిగా నిలిచింది. భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా ఆ రంగంలో అద్భుతాలు సృష్టించిందన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల నెలకొల్పిన ములుగు ఫారెస్టు కళాశాలలో బీఎస్సీ చదివి ఆ తర్వాత బెనారస్ యూనివర్సిటిలో పీజీ, ఇప్పుడు రాయపూర్ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేయడమంటే అసాధరణమైన ప్రతిభతో వెన్నెల శ్రమించడమే ఇందుకు కారణమని అన్నారు. వెన్నెలకు ఆమె తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News