Friday, September 20, 2024

ఆదివాసీ మహిళ ఘటనపై ఆరా..డిజిపికి బండి సంజయ్ ఫోన్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై గత నెల 31న ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించిన ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర డిజిపిని ఆరా తీశారు. కేంద్రమంత్రి బుధవారం డిజిపి జితేందర్‌కి ఫోన్ చేసి ఈ సంఘటనపై ఆరా తీశారు. గత నెల 31న ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణాలపై డిజిపిని అడిగి తెలుసుకున్నారు. జైనూర్‌లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు ఉన్న కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ మహిళ కేసు పూర్వాపరాలను, ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవడానికి కారణాల ఏమిటని అడిగారు.

ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సంజయ్ డిజిపిని కోరారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News