Monday, September 1, 2025

కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ ను కాపాడుతూ ఆలస్యం చేసింది: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బిఆర్ఎస్ బాధ్యత వహించాలని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. కాళేశ్వరంపై బిజెపి వైఖరే నిజమని మరోసారి రుజువైందని అన్నారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై బిజెపి సిబిఐ విచారణను కోరిందని, కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ ను కాపాడుతూ ఆలస్యం చేసిందని విమర్శించారు. నిజానికి తలవంచి సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగింతకు అంగికరించారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే సిబిఐకి లేఖ ఇవ్వాలని బండి సూచించారు. గతంలో ఒఆర్ఆర్ టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్ ను ప్రకటించిందని, అది నేటికి ఆచరణ రూపంలోకి రాలేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్ లా కొనసాగుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Also Read : మాకు మరో వారం గడువు ఇవ్వండి.. స్పీకర్‌కు కడియం శ్రీహరి విజ్ఞప్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News