Saturday, September 13, 2025

హ్యాపీ మూడ్‌లో…

- Advertisement -
- Advertisement -

Bangarraju teaser will release tomorrow

 

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నూతన సంవత్సరం రోజున ‘బంగార్రాజు’ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య మీసాలు తిప్పుతూ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. నాగార్జున పంచె కట్టులో నాగచైతన్య స్టైలిష్ లుక్ కనిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News