Sunday, September 15, 2024

అమెరికా కుట్రకు బంగ్లాదేశ్ బలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హ స్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అ ధినేత షేక్ హసీనా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడు తూ ఆరోపణలు చేశారు. “సెయింట్ మార్టిన్ ద్వీ పంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి, అమెరికా కు బంగాళా ఖాతంలో పట్టు కల్పిస్తే ప్రధాని పదవిలో కొనసాగేదాన్ని” అని ఆమె అమెరికాపై నేరు గా ఆ రోపణలు చేశారు. విద్యార్థుల శవాలపై అధికారా న్ని చేజిక్కించుకోవాలనుకొన్నారని, దానిని అంగీకరించలేక ప్రధాని పదవికి తాను రాజీనా మా చే శానని హసీనా పేర్కొన్నారు. అతివాదుల మాయ లో పడవద్దని బంగ్లాదేశ్ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చే శారు. తిరిగి త్వరలోనే బంగ్లాదేశ్‌కు వ స్తానని తె లిపారు. చాలా మంది నాయకులు, కా ర్యకర్తలు, సామాన్యులు హత్యకు గురైన విషయం తెలిసి చా లా బాధపడ్డానని హసీనా చెప్పుకొచ్చా రు. పలువు రు పార్టీ నేతల ఇళ్లను కూడా నిరసనకారులు ధ్వం సం చేశారని అన్నారు.

ఏడాది మే నెలలో కూడా హసీనా ఓ కీలక ప్రకటన చేశా రు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చే సుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే …తన ఎ న్నిక సాఫీగా జరిగేటట్టు చేస్తానని ఆఫరిచ్చిందని దేశం పేరు చెప్పకుండా విమర్శించారు. ఈ ప్రకటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, ఆదే శం అమెరికాయే అయి ఉంటుందనే ప్రచారం జ రిగింది.ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్యా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్షంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ వారి లక్షం అదికాదు. అది ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసునని, మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చని ఆరోపించారు. తాను జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తెనని , మా స్వాతంత్య్ర పోరాటంలో మేము గెలిచామని స్పష్టంగా చెప్పానని తెలియజేశారు.

నా దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చో, అప్పగించో అధికారం లోకి రావాలని నేను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈస్ట్‌తైమూర్ వలే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లోని చోటోగ్రామ్, మయన్నార్ లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొంటారని నాడు హసీనా పేర్కొన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News