- Advertisement -
రేపటి నుంచి జూన్ ప్రారంభం కానుంది. ఈ నెలలో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నాయి. 5 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు వివిధ ప్రదేశాలలో 5 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. జూన్ నెల సెలవులతో ప్రారంభమవుతుంది. జూన్ 1 ఆదివారం సెలవు ఉంది. బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎటిఎం ద్వారా డబ్బు లావాదేవీలు చేయవచ్చు లేదా ఇతర పనులు చేసుకోవచ్చు.
ఈ సౌకర్యాలు బ్యాంకు సెలవుల వల్ల ప్రభావితం కావు. కేరళలో జూన్ 6 నుండి 8 వరకు వరుసగా 3 రోజులు బ్యాంకులలో ఎటువంటి లావాదేవీలు ఉండవు. జూన్ 6న ఈద్-ఉల్-అజా, జూన్ 7న బక్రీద్, జూన్ 8న ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేస్తారు. ఒడిశా-, మణిపూర్‌లో జూన్ 27 నుండి 29 వరకు, మిజోరంలో జూన్ 28 నుండి 30 వరకు బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూసివేయనున్నారు.
- Advertisement -