Thursday, December 7, 2023

బ్యాంకులకు సెలవులు.. నవంబర్‌లో ఎన్ని రోజులంటే…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనలో నవంబర్‌లో 12 రోజుల సెలవులు ఉంటాయని తెలిపింది. మరి.. నవంబర్ నెలలో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం..?

నవంబర్ 1 – బుధవారం (కరక చతుర్థి, ఈ రోజును జరుపుకోవడానికి భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.)
నవంబర్ 5 – ఆదివారం
నవంబర్ 10 – శుక్రవారం (వంగ పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకు సెలవు)
నవంబర్ 11 – రెండవ శనివారం
నవంబర్ 12 – ఆదివారం (దీపావళి కూడా)
నవంబర్ 13 – సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీలో బ్యాంకు సెలవు)
నవంబర్ 15 – బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
నవంబర్ 19 – ఆదివారం
నవంబర్ 24 – శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలో బ్యాంకు సెలవు)
నవంబర్ 25 – నాల్గవ శనివారం
నవంబర్ 26 – ఆదివారం
నవంబర్ 27 – సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకు సెలవు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News