Friday, August 15, 2025

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు: తొమ్మిది మంది మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలోని బార్‌కోట్-యమునోత్రి మార్గంలో సిలాయ్‌లో ఓ హోటల్ కూలిపోవడంతో తొమ్మిది మంది శిథిలాల కింద ఉన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎప్, రెస్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్లు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికైనా కొండ ప్రాంతాలలో అటవీ విస్తీర్ణం పెంచాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. కలపను విచాక్షణరహితంగా నరకడంతోనే కొండచరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. క్లౌడ్ బస్టింగ్ జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News