Saturday, June 1, 2024

రేపటి నుంచి చార్‌ధామ్ యాత్ర శుభారంభం

- Advertisement -
- Advertisement -

ఉత్తరాది హిమాలయాల్లో చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర సందడి ఆరంభం అయింది. అశేష భక్తుల సందర్శనకోసం శుక్రవారం నుంచి ఉత్తరాఖండ్‌లోని కేదారినాథ్ , గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులు తెరుచుకుంటాయి. ఆరునెలల పాటు శీతాకాలం మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలకు నేటి నుంచి యాత్రికులను అనుమతిస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయాలు గర్హవాల్ హిమాలయ శ్రేణువులలో నెలకొని ఉన్నాయి.. సాధారణంగా ఈ ఆలయాలను వేసవి కాలం ఆరంభదశలో తిరిగి తెరుస్తారు. కేదారినాథ్, యమునోత్రి ఆలయాలను శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పూజాదికాలకు తెరుస్తారు. కాగా గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు తెరుచుకుంటుందని దేవాలయాల కమిటీ అధికారులు గురువారం తెలిపారు.

ఇక చార్‌ధామ్ యాత్రలోనే భాగమైన బద్రీనాథ్ ఆలయం ఈ నెల 12న సందర్శనకు సిద్ధం అవుతుంది. ఆలయాల దర్శన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీ(బికెటిసి) మీడియా నిర్వాహకులు హరీష్ గౌర్ తెలిపారు. కేదారినాథ్ ఆలయాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. కాగా ఛార్‌ధామ్ యాత్ర ఆరంభ సూచకంగా గురువారం రిషికేష్ నుంచి 135 వాహనాలలో దాదాపు నాలుగువేల మంది యాత్రికులతో ఓ బృందం బయలుదేరిందిజ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఛార్‌ధామ్ యాత్రకు జనం వస్తారని ఆశిస్తున్నట్లు వాహనానికి పచ్చజెండా చూపి పంపించిన ఉత్తరాఖండ్ మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

దైవ ప్రకృతి సంబంధితం చార్‌ధామ్
హిమాలయాల్లో నెలకొన్న .చార్‌ధామ్ యాత్ర అంతర్భాగ ఆలయాలు శివుడికి , విష్ణువుకు, జీవనదులు గంగ, యమునలకు ప్రతీకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం, అంతకు మించిన ప్రకృతి రమణీయతల సందర్శనకు ప్రజలు ఎంత కష్టం అయినప్పటికీ వస్తుంటారు.
ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్ర మే 10వ తేదీన ఆరంభం అయ్యి నవంబర్ వరకూ సాగుతుంది. ఇందులో భాగంగా కేదార్‌నాథ్ ఆలయం నవంబర్ 2న, బర్రీనాథ్ ఆలయం నవంబర్ 9న, గంగోత్రి ఆలయం నవంబర్ 3న, యమునోత్రి కూడా నవంబర్ 3న శీతాకాల ఆరంభ దశలో మూతపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News