Saturday, August 16, 2025

యదార్థ సంఘటనల ఆధారంగా..

- Advertisement -
- Advertisement -

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. (Mutton soup) మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. “పర్వతనేని రాంబాబు సారథ్యంలో రామచంద్ర వట్టికూటి దర్వకత్వంలో రాబోతోన్న చిత్రం ‘మటన్ సూప్’. టైటిల్ పోస్టర్ బాగుంది.

సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ మంచి చిత్రంతో (good picture) రాబోతోన్న మా అందరినీ ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. “యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకుని మటన్ సూప్ సినిమాను రూపొందించాం. త్వరలోనే సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రమణ్, నిర్మాత రామకృష్ణ సనపల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత అరుణ్ చంద్ర వట్ట్టికూటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News