Tuesday, October 15, 2024

ఐపిఎల్ రిటెన్షన్‌పై బిసిసిఐ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ముంబై : వచ్చే ఏడాది ఐపిఎల్ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బిసిసిఐ తాజాగా ప్రకటించింది. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ప్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్(ఆర్‌టిఎం) ఆప్షన్ ఉంది. టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సీజన్ నుంచి ప్రతి ప్లేయర్ ఆడే మ్యాచ్‌కు రూ.7.50 లక్షల ఫీజు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ నియమంను బీసీసీఐ మరలా తీసుకొచ్చింది.

ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లు ఎక్కువ డబ్బు పొందకుండా బిసిసిఐ ఓ రూల్‌ను కొత్తగా తీసుకొచ్చింది. వచ్చే ఐపిఎల్‌లో ఓ భారత ఆటగాడు అత్యధికంగా రూ.18 కోట్లు పలికితే.. ఐపిఎల్ 2026 మినీ వేలంలో విదేశీ ప్లేయర్స్ అంతకంటే ఎక్కువ ధరను సొంతంచేసుకోలేరు. ఒకవేళ ఎక్కువ ధర దక్కించుకున్నా.. రూ.18 కోట్లు మాత్రమే అతడికి దక్కుతాయి. మిగిలిన డబ్బు బిసిసిఐ ఖాతాలోకి చేరుతుంది. ఆ డబ్బును ఆటగాళ్ల సంక్షేమం కోసం బిసిసిఐ ఖర్చు చేయనుంది. ఎక్కువ ధర సొంతం చేసుకునేందుకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనకుండా.. మినీ వేలంలో బరిలోకి దిగుతున్నారు. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News