Monday, September 1, 2025

‘ది ప్యారడైజ్’ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’లో ఇంతకుముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ను గ్లోబల్ సిని మా విజన్‌తో చాలా గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ది ప్యారడైస్ టీం హాలీవుడ్‌లోని కనెక్ట్ మోబ్ సీన్ ఎగ్జిక్యూటివ్ విపి ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటిని కలసి సినిమా కోసం కొలాబరేషన్ గురించి చర్చిస్తున్నారు.

మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ని రీజనల్ సినిమా లాగా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వెర్షన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్‌ని కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి టీం చర్చలు జరుపుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయా ళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.

Also Read : వర్షం మిగిల్చిన విధ్వంసం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News