Tuesday, June 17, 2025

వంకాయ అని చీప్ గా చూడకండి.. తింటే ఎన్ని ప్రయోజనాలో..

- Advertisement -
- Advertisement -

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి అనేక ఖర్చులు చేస్తున్నారు. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కూరగాయల భాగంగానే వంకాయ తీసుకుంటాము. వంకాయ అందరూ ఇష్టపడే కూరగాయల లిస్టులో లేకపోయినా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేక పోషకాలు నుండి ఉంటాయి. ఇప్పుడు వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వంకాయలో ఫైటో న్యూట్రియంట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా మెదడులోనే నరకనాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరిగి, మతిమరుపు తగ్గుతుంది.

నిపుణుల ప్రకారం.. వంకాయ నిద్రలేమి లాంటి సమస్యలకు సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వీడిని తగ్గించి, తలనొప్పి, మలబద్ధకం, గొంతులో గరగర వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా మొదటి దశలో ఉన్న కిడ్నీ రాళ్ళను సైతం కరిగించే గుణం ఇందులో ఉంటుంది.

వంకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివలన కడుపు నిండిన భావన కలుగుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి శరీర బరువు అదుపులో ఉంచుతుంది. షుగర్ ఉన్నవారు వంకాయ తినవచ్చు. ఇందులో ఉండే పాలిఫినాల్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News