Thursday, April 25, 2024

విషాదం.. తీవ్ర అనారోగ్యంతో 24ఏళ్ల బెంగాలీ నటి మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బెంగాలీ నటి ఐండ్రిల్లా శర్మ బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. వారం రోజుల పాటు ఆమె తీవ్రస్థాయి అనారోగ్యంతో బాధపడి కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకు ముందు ఆమెకు రెండుసార్లు క్యాన్సర్ వచ్చింది. నయం అయిన తరువాత తేరుకుని తిరిగి 2015లో సినిమాలలో నటించింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఈ నటి బెంగాలీ టీవీ సీరియల్స్‌లో నటించి విశేష ప్రాచుర్యం దక్కించుకున్నారు. జియాన్ కథి, ఝుమూర్, జిబన్ జ్యోతి వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువ అయ్యారు.

ఎవింగ్స్ సర్కోమా అనే తీవ్రస్థాయి అరుదైన క్యాన్సర్‌తో ఆమె బాధపడ్డారు. ఇది ఎముకలలో, కణజాలంలో ఏర్పడుతుంది. సర్జరీ, కెమోరేడియేషన్‌తో కొంత మేరకు కోలుకున్నారు. అయితే ఈ నెల 1న ఆమె బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హౌరాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తీవ్రస్థాయి రక్తస్రావం అయింది. పలు రకాలుగా నిపుణులైన పలువురు డాక్టర్ల బృందం చికిత్స జరిపినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Bengali Actress Aindrila Sharma died of Cardiac Arrest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News