Sunday, October 6, 2024

మెట్రో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మెట్రో స్టేషన్‌లో ఓ యువ‌కుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కర్నాటకలో జరిగింది. బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్‌లో సిద్దార్థ్ అనే యువకుడు(30) ఆర్థిక ఇబ్బందులతో మెట్రో రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిద్ధార్థ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News