Saturday, April 27, 2024

Liquor case: హడలెత్తిస్తున్న అధికారిణి.. ఆమె పేరే భానుప్రియ మీనా!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన లేడీ డైనమిక్ ఆఫీసర్ గుర్తున్నారా?.. కవిత అరెస్ట్ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావ్ వాదనకు దిగితే.. వారికి దీటుగా సమాధానం ఇచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసరే భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్.. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ గా బాధ్యతలు వహిస్తున్నారు. మద్యం స్కామ్ లో కుట్రలను వెలుగులోకి తీసుకువస్తున్న మహిళా అధికారిణి ఆమె.

విధులపట్ల నిబద్ధత ఉన్నఅధికారిగా పేరు తెచ్చుకున్న భానుప్రియ మీనా.. ఢిల్లీ మధ్యం స్కామ్ కేసులో హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చి ఈడీ వారెంట్ అందజేసి.. కవితను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర వహించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, ఇతర నిందితులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టడంతో పాటు పలువురు నిందితులు అప్రూవర్లుగా మారడంలోనూ డైనమిక్ లేడీ భానుప్రియదే కీలకపాత్ర.

రాజస్థాన్ కు చెందిన  భానుప్రియ మొదట ఐటీ శాఖలో పనిచేశారు. మూడేళ్లుగా డెప్యుటేషన్ పై ఈడీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమెపై ఆమ్ ఆద్మీపార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. సాక్షులను వేధింపులకు గురిచేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని గతంలో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు.  ప్రస్తుతం భానుప్రియ మీనాపై కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కేసు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News