Sunday, May 18, 2025

రేవంత్ రెడ్డిపై దాడి ఘటనను ఖండించిన భట్టి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై భూపాలపల్లిలో కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేసిన ఘటనను సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు.

దాడులు చేసే సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News