Thursday, May 2, 2024

కరెంట్ కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరెంట్ కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు రెడీగా ఉంచామని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధం చెప్పారని, ఆ ఏడు వేలకోట్లు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయని భట్టి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అన్ని అబద్ధాలే చెప్పారని, ప్రస్తుతం బిఆర్‌ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. రైతులలో 93 శాతం మందికి రూ. 5500 కోట్లు రైతు బంధు విడుదల చేశామని భట్టి ప్రకటించారు. మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఫ్రీజర్నీ కల్పించామని, ఇప్పటికే ఫ్రీ టికెట్ల కింద ఆర్‌టిసి సంస్థకు రూ.1020 కోట్లు ఇచ్చామని, మధ్యాహ్న భోజనానికి మహిళా సంఘాలకు నిధులిచ్చామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు భట్టి సవాల్ విసిరారు. ధనిక రాష్ట్రంలో కొందరే లాభపడ్డారని, ధనిఖ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని బిఆర్‌ఎస్సోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలు వివరించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News