Monday, December 2, 2024

బిఆర్ఎస్ సర్కార్ 24 లక్షల ఎకరాలు కొట్టేసింది: భబ్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. వారి ప్రభుత్వ హయాంలో కొట్టేసిన భూముల వ్యవహారం బయటకు తీస్తామని భట్టి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య ఎలాంటి విభేదాల్లేవని, పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదని చెప్పారు.

అభివృద్ధి ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక, హైడ్రా, మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నామన్నారు. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని.. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం 24 లక్షల ఎకరాలు కాజేసిందని, ఆ భూముల వ్యవహారాన్ని త్వరలోనే బయటకు తీసుకొస్తామని భట్టి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News