Wednesday, April 24, 2024

భూతద్ధం భాస్కర్‌ నారాయణ సినిమా చూసి క్రేజీ ఫీలింగ్ తో బయటకు వస్తారు – శివ కందుకూరి

- Advertisement -
- Advertisement -

 

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భూతద్ధం భాస్కర్‌ నారాయణ”. ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రబృందం.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మీడియాకి థాంక్యూ. తనకు మంచి రోల్ ఇచ్చారు సినిమాలో, మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లా అనిపించింది. ఈ స్టోరీ వినగానే ఈ కేరక్టర్ ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపించిందని, ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుందని తెలిపారు. ఖచ్చితంగా చూడాలని కోరారు.

డైరెక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ ముందుకు నా తల్లి తండ్రులకు, మీడియాకు థాంక్స్. ఈ కథ రాయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ అన్నఅని, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా అయిపోయాక, డిటెక్టివ్ బాబీ అని ఒక కథ కావాలి అన్నాడు. ఈ విషయం తనకు మా రూమ్మెట్ చెప్పగానే ఒక డిటెక్టివ్ స్టోరీ రెడీ చేశానని, ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ తనకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారని అన్నారు. మా హీరో శివ కందుకూరి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.ఆయన ఒక అసోసియేట్ డైరెక్టర్ లా హెల్ప్ చేశారని తెలిపారు. 31st మార్చ్ ఈ సినిమా రాబోతుంది చూసి ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ స్నేహాల్ మాట్లాడుతూ హీరో తేజ గారికి, నిర్మాత రాహుల్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ పూర్తి స్క్రిప్ట్ ను తనకు డైరెక్టర్ ముందే పంపించాడు శశిధర్‌, కార్తీక్‌ నేను 150 పేజిస్ వరకు చదివి ఇది చెయ్యాలని ఫిక్స్ అయిపోయామని అన్నారు. డైరెక్టర్ పురుషోత్తం వెరీ టాలెంటెడ్, తరువాత మేము ఒక టీం ను బిల్డ్ చేసి ఈ సినిమాను పూర్తిచేశామని సూచించారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు థాంక్యూ. ఈ రోజు కోసం చాలారోజులు వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ టీజర్ ను బిగ్ స్క్రీన్ పై చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరు మాకు ఒక ఫ్యామిలీ లాంటివారని.
మా ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఔట్పుట్ కోసం చాలా ఖర్చుపెట్టారని అన్నారు. హీరో తేజ సజ్జ, నిర్మాత రాహుల్ యాదవ్, హీరో తిరువీర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఒక మంచి సినిమాను మీకు ఇవ్వబోతున్నాం. ఈ సినిమా చూసి మీరొక క్రేజీ ఫీలింగ్ తో బయటకు వస్తారని ఆశించారు.

హీరో తేజ సజ్జ మాట్లాడుతూ ముందుగా సీనియర్ నటి జమున గారికి సంతాపం తెలిపారు. ఈ సినిమా టీజర్ చూసి నేను ఈ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ స్నేహల్‌,శశిధర్‌, కార్తీక్‌ ఇంకా మీరెన్నో మంచి సినిమాలు చెయ్యాలని, కొత్తవాళ్లు ఎక్కడున్నా రాజ్ కందుకూరి ఎంకరేజ్ చేస్తారని అన్నారు. అలానే ఈ సినిమా చూడండి నచ్చితే ఒక పదిమందికి చెప్పండి అని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News