Wednesday, February 12, 2025

బిలావల్ భుట్టో ఓటమి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో ఓటమి పాలయ్యారు. లాహోర్ ఎన్ఏ 127 స్థానంనుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని బెనజర్ భుట్టో కుమారుడు బిలావల్.. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అభ్యర్థి అతావుల్లా తారార్ చేతిలో పరాజయం పాలయ్యారు. అతావుల్లాకు 98వేల ఓట్లు రాగా, బిలావల్ కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే తమ నాయకుడి ఓటమికి రిగ్గింగ్ జరగడమే కారణమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News