Wednesday, May 8, 2024

వారిని రక్తదాహంతో వీధుల్లో వేటాడారు

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ న్యూఢిల్లీ : 2002 గుజరాత్ ఘర్షణల దశలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం , కుటుంబ సభ్యుల వధ ఘటన పరమకిరాతకం అని సుప్రీంకోర్టులో బిల్కిస్ తరఫు లాయరు శోభాగుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు దిగిన వారు ముస్లింలను చంపేందుకు రక్తదాహంతో ఉన్నట్లుగా వేటాడినట్లుగా వ్యవహరించారని అప్పటి ఉదంతం ఆద్యంతం భయానకం అమానుషం అని తెలిపారు. 11 మంది దోషులకు గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం శిక్షలను తగ్గించిన అంశాన్ని సవాలు చేస్తూ బాధితురాలి తరఫున దాఖలు అయిన పిటిషన్‌పై న్యాయవాది శోభా గుప్తా తమ వాదన విన్పించారు. బిల్కిస్ గర్భవతి, తనను చంపొద్దని, కనికరం చూపాలని వేడుకుంది. కాళ్లుపట్టుకుంది. అయితే రక్తదాహం పట్టిన మాదిరిగా దారుణంగా వ్యవహరించారు. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని, మొదటి బిడ్డను రాయికేసి బాది చంపేశారని , సోదరిలాంటిదని చెప్పినా వినలేదని, ఏదో అక్కడికక్కడ జరిగిన క్షణకాల ఆవేశ పూరిత ఘటన కాదని,

చుట్టుపక్కల వారే అక్కడికి చేరుకుని వీరు ముస్లింలు చంపేయండని అరుస్తూ వెంటాడి దారుణంగా వ్యవహరించారని లాయరు సుప్రీంకోర్టుకు తెలిపారు. న్యాయమూర్తులు బిబి నాగరత్న, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ముందు తమ వాదన విన్పించారు. దయచూపండని ఆమె వారిని వేడుకుందని, కానీ తరిమిపట్టుకుని దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. గుజరాత్ హైకోర్టు కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుందని, అత్యంత హేయమైన నేరం అని గుర్తించిందని అయితే ఆ తరువాత ఇంతటి నేరానికి పాల్పడ్డ వారికి 2022 ఆగస్టు 15న శిక్ష రిమిషన్ కల్పించారు. వీరి విడుదల దశలో జైలు ఆవరణలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయని, బాణాసంచా పేల్చడం, మిఠాయిలు పంచుకోవడం జరిగిందని, దీనిని బిల్కిస్ అక్కడ గుర్తించిందని, తనకు జరిగిన దారుణం, బాధ్యులైన వారికి దక్కిన గౌరవాన్ని బేరీజువేసుకునే స్థితికి చేరిందని లాయర్ తెలిపారు. విచారణ తిరిగి మంగళవారం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News