Home తాజా వార్తలు హైదరాబాద్ మరో ఆతిథ్యం

హైదరాబాద్ మరో ఆతిథ్యం

BioAsia Conference in Hyderabad

24-25 తేదీల్లో బయో
ఏషియా అంతర్జాతీయ
సదస్సు ఫ్యూచర్ రెడీ
టీమ్‌తో నిర్వహణ
హాజరు కానున్న
70దేశాల నుంచి 30వేల
మంది ప్రతినిధులు

మన తెలంగాణ/హైదరాబాద్ : మరోసారి అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ నగ రం వేదిక కాబోతున్నది. వచ్చే నెల 24వ తేదీన తలపెట్టిన తలపెట్టిన బయో ఏషియా సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర ప్ర భుత్వం ఆధ్వర్యంలో 24,25 తేదీల్లో రెండురోజుల పాటు జరగనున్న సదస్సు నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా జరగనుం ది. లైఫ్-సైన్సెస్ పరిశ్రమ భవిష్యత్తు సంసిద్ధతపై దృష్టి పెట్టడానికి థీమ్ ‘ఫ్యూచర్ రెడీ’ పేరుతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నా రు. ఆసియాలోనే అతిపెద్ద బయోటెక్నాల జీ.. ఫోరమ్‌కు వర్చువల్‌గా హా జరయ్యేందుకు 70కంటే ఎక్కువ దేశాల నుంచి సుమారు 30వేల మంది ప్రతినిధు లు పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అనేక దేశాల నుంచి అధికారులు, పరిశ్రమలు, పెట్టుబడిదారులతో పాటువిద్యాసంస్థల నుండి ప్రముఖ వక్తలు హాజరుకానున్నారు. 19వ ఎడిషన్‌లో భాగాంగా నిర్వహిస్తున్న థీమ్ ఫ్యూచర్ రెడీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ దాని భవిష్యత్తు తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కరోనా మహమ్మారి మధ్య లైఫ్-సైన్స్‌ల భవిష్యత్తుపై దృష్టి సారించే విస్తృతంగా విశ్లేషిస్తారు. భవిష్యత్తులో కరోనాను ఎదుర్కోవడానికి పరిశ్రమ దృష్టి సారించే మార్గాలను అన్వేషిస్తారు.