Tuesday, November 12, 2024

సినిమా వాళ్లకు మెప్పులే కావు…తిప్పలూ తప్పవు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల ‘లవ్ రెడ్డి’ అనే సినిమా వచ్చింది. కాగా ఈ సినిమా టీమ్ థియేటర్ కు వచ్చినప్పుడు అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది.  మూవీ టీమ్ కూడా షాక్ తిన్నది. ఆ సినిమాలో పాత్ర మనసుకు హత్తుకోగా, నిజంగానే విలన్ ప్రేమ జంటను విడదీసాడంటూ ఓ మహిళ విలన్ పాత్ర పోషించిన నటుడిని గల్లా పట్టుకుని మరీ కొట్టింది. చిత్ర బృందం తాలూకు మిగతా వారంత బిత్తరపోయారు. తర్వాత ఆ విలన్ నటుడిని కాపాడారు.

ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్, సెహెరి స్టూడియో కలిసి ఎమ్జీఆర్ బ్యానర్స్ పై తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా సినిమా తీశారు. అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదలయింది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. విషయం ఏమిటంటే సినిమాలో హిరో, హిరోయిన్ ను హిరోయిన్ తండ్రి విడదీస్తాడు. విలన్ గా రామస్వామి నటించాడు. నటించాడనేకంటే జీవించేశాడు.

హైదరాబాద్ లోని నిజాంపేట జిపిఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో సినిమా తారాగణం వీక్షించింది. సినిమా అయిపోయాక ఓ మహిళ వారి దగ్గరికి వచ్చి, విలన్ గా నటించిన రామస్వామిపై దాడి చేసింది. ఇప్పుడు ఈ ఘటన తాలూకు వీడియో ‘ఎక్స్’ లో వైరల్ అయింది. అయితే ఇది నిజంగా జరిగిందా, సృష్టించిందా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News