Saturday, April 27, 2024

మేఘాలయ సిఎంపై బిజెపి అభ్యర్థిగా మాజీ ఉగ్రవాది పోటీ

- Advertisement -
- Advertisement -

షిల్లాంగ్: మేఘాలయ దక్షిణ తుర నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి కొన్రాడ్ కె సంగ్మాపై మాజీ ఉగ్రవాది బెర్నాడ్ మారక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు గురువారం బీజేపీ వెల్లడించింది. మేఘాలయలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. కొన్నాడ్ సంగ్మా నేతృత్వంలోని పాలక పక్షం మేఘాలయ డెమొక్రటిక్ ఎలియన్స్ నుంచి వైదొలగడానికి గత నెల బీజేపీ నిర్ణయించింది. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మాకు, బెర్నాడ్‌కు మధ్య వ్యకిగత వైరం ఉంది. తురాలో బెర్నాడ్ తన ఫార్మ్‌హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్టు అక్రమంగా మానవ రవాణా చేస్తున్నట్టు ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు.

గారో గిరిజన వర్గానికి ప్రత్యే క రాష్ట్రం సాధించడం కోసం సాయుధ ఉగ్రవాద గ్రూపు అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్ (ఎఎన్‌విసి)లో బెర్నాడ్ చేరారు. అయితే 2014లో ఆయుధాలను విడిచిపెట్టి ఎఎన్‌విసిని రద్దు చేశారు. తుర జిల్లా కౌన్సిల్ సభ్యుడుగా కూడా ఆయన ఉన్నారు. అరవై మంది బీజేపీ అభ్యర్థుల జాబితాలో ప్రస్తుత ఇద్దరు బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు సంబోర్ షుల్లై, ఎఎల్ హెక్ ఉన్నారు. వీరిద్దరూ దక్షిణ షిల్లాంగ్, పైంతోరుఖురా నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తారు. మాజీ స్పీకర్లు కాంగ్రెస్‌కు చెందిన ఇడి మారక్, ఎన్‌పిపికి చెందిన మార్టిన్ డాంగో కూడా బిజెపి జాబితాలో ఉన్నారు. వీరిద్దరూ ఖర్ఖుట్టా, రాణికోర్ నియోజక వర్గాల నుంచి పోటీకి నిలబడ్డారు.

ప్రస్తుతం పార్టీ ఫిరాయించి, బీజేపీలో చేరిన ఎమ్‌ఎల్‌ఎలకు కూడా బీజేపీ అభ్యర్థుల జాబితాలో చోటు లభించింది. అలాంటివారిలో హెచ్‌ఎం షాంగ్‌ఫ్లియాంగ్, ఫెర్లిన్ సంగ్మా, బెనెడిక్ట్ మారక్, శామ్యూల్ ఎం సంగ్మా, ఉన్నారు. వీరు క్రమంగా మాసిన్రాం, సెల్సెల్లా, రాక్ సంగ్రే, బఘ్మారా నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ 2018లో నాంగ్‌తిమ్మై నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఇప్పుడు పశ్చిమ షిల్లాంగ్ నుంచి పోటీ చేస్తారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎంహెచ్ ఖర్క్‌రంగ్ ఉత్తర షిల్లాంగ్ నుంచి పోటీ చేస్తారు. ఈ జాబితాలో ఏడుగురు మహిళలకు కూడా చోటు దక్కింది. వీరిలో మాజీ ఎన్‌పిపి ఎమ్‌ఎల్‌ఎ ఫెర్లిన్ సంగ్మా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News