Tuesday, December 10, 2024

కాంగ్రెస్ వైఫల్యాలపై నేడు బిజెపి ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నేడు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ, జిల్లాల వారీగా ఛార్జ్ షీట్ తయారు చేసి విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో అరకొర రుణమాఫీ చేసి మొత్తం పూర్తి చేశామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు రాలేదని, గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలనే వీళ్లు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు గత పార్లమెంటు ఎన్నికలే నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని ఇటీవల తనను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. ప్రజల తరపున ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని, అదే స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు, బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్ పాల్గొని బూత్, మండల స్థాయి కమిటీల నియామకంపై జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.

పార్టీలో కొత్త రక్తం చేరబోతోంది
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలని నేతలను పిలుపునిచ్చారు. కొత్త రక్తం పార్టీలో చెరబోతోందని, గ్రామ స్థాయి నుంచి జాతీయి స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మరింత బలపడడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో శనివారం కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ లో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె.అరుణలు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు వర్క్ షాప్ కు హాజరయ్యారు. వర్క్ షాప్ లో చర్చించిన అంశాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. సభ్యత్వ నమోదులో పురోగతి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిపినట్లుగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News