Friday, May 10, 2024

పార్టీ ఎంపీకి బీజేపీ షోకాజ్ నోటీస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. ఆయనను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది.

గురువారం చంద్రయాన్ 3 విజయంపై చర్చ సందర్భంగా బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు. బిధూరీ వ్యాఖ్యల పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. డానిష్ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఇలాంటి పదజాలం ఇంతకు ముందెన్నడూ వినలేదు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరం. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది.

ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ఓబీసీలను , ముస్లింలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ముస్లిం ఎంపీ పట్ల బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశం లోని గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. ప్రధాని ఆదేశానుసారమే పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీపై బీజేపీ సభ్యుడు అసభ్య పదజాలం వినియోగించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News