Tuesday, April 30, 2024

బిజెపి మేనిఫెస్టో కాలంచెల్లిన చెక్కులాంటిది

- Advertisement -
- Advertisement -

ఈసారి బిజెపికి 2004 చరిత్ర పునరావృతం
ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపిస్తారు
ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బిజెపి ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిజెపి మేనిఫెస్టో కాలంచెల్లిన చెక్కులాంటిదని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బిజెపి ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందన్నారు. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బిజెపి పాలనను సోనియాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితి పునరావృతమైందన్నారు. అప్పటిలాగే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బిజెపిని తిరస్కరించి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపిస్తారని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నా రన్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.

ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా బిజెపి పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని సిఎం ఆరోపించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆదివారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ‘సంకల్ప్ పత్ర’గా నామకరణం చేయగా, ప్రధాని మోడీ హామీ పేరుతో 14 కీలక అంశాలను ఈ మేనిఫెస్టోలో బిజెపి పొందుపరిచింది. ఈ క్రమంలోనే కమలనాథుల మేనిఫెస్టోపై తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News