Saturday, July 27, 2024

నాణ్యమైన విద్య, పేదలకు పక్క ఇళ్లు గ్యారంటీ…

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రాన్ని పూర్తిగా అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ ఆఫీసులో బిజెపి మేనిఫెస్టో… సంకల్ప పత్రాన్ని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వికసిత భారత్ కోసం బిజెపి కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ విభజిత భారత్ కోసం పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పేదవాళ్ల కోసం మరో 3 కోట్ల ఇళ్లను మోడీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. అవినీతి బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని తెలిపారు.

2047 వికసిత భారత్ పేరుతో బిజెపి ముందుకెళ్తోందన్నారు. దేశంలో 95 శాతం ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచలో ఐదోవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో మూడోవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది అని మోడీ గ్యారంటీ ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన విద్య, అందిరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీ అని ఆయన తెలిపారు. ఆరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News