Wednesday, December 6, 2023

స్పీకర్ సీరియస్.. పార్టీ షోకాజ్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ రాశారు. అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించడం పట్ల బీజేపీ షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. మరోవైపు రమేశ్ బధూరీ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న బీజేపీ నేత హర్షవర్ధన్ … నవ్వుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రమేశ్ ఏం మాట్లాడారో తనకు సరిగా వినిపించలేదని , తనకు సంబంధం లేకపోయినా కావాలనే ఈ వివాదం లోకి లాగుతున్నారంటూ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News