Saturday, April 13, 2024

195మంది ఎంపి అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే ప్రకటించారు. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. తొలి జాబితాలో 28 మంది మహిళలు అవకాశం ఇవ్వగా.. 47మంది యువతకు ఛాన్స్ ఇచ్చామని ఆయన చెప్పారు. 34 మంది మంత్రులకు తొలి జాబితాలోనే చోటు కల్పించారు.

ఇక, తెలంగాణ నుంచి 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా… ఉత్తర్ ప్రదేశ్ లో 51, బెంగాల్‌ 20, మధ్యప్రదేశ్‌ 24, గుజరాత్‌ 15, రాజస్థాన్‌ 15, కేరళ 12, అసోం 11, ఝార్ఖండ్ 11, ఛత్తీస్ గఢ్ 11, ఢిల్లీ 5 సీట్లు, జమ్మూ కశ్మీర్ 2, ఉత్తరాఖండ్, 2, అరుణాచల్ ప్రదేశ్, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్ డయ్యూ 1 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News